రోజా...ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకురాలు. టీడీపీలో రాజకీయాలు మొదలుపెట్టి, వైసీపీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా...నెక్స్ట్ జగన్ కేబినెట్లో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అసలు మొదటి విడతలోనే రోజాకు మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. కానీ సామాజికవర్గాల సమీకరణాల్లో రోజాకు మంత్రి పదవి దక్కలేదు. అయితే మొదటి విడతలో ఛాన్స్ దక్కని వారికి రెండో విడతలో ఛాన్స్ ఇస్తానని జగన్ చెప్పారు.