కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ ఎక్కువ మంది నుంచి వస్తున్న విజ్ఞప్తిని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. కొవిడ్ చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నాయని, అవి పేద, మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారాయనే వాదనతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. వాటిని సమీక్షించి, క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందన్నారు. చికిత్స ఖర్చు విషయంలో జాతీయ స్థాయిలో ఏకీకృత విధానం రూపొందించాలనే సూచనపై సమీక్షిస్తామని చెప్పారు కేటీఆర్.