ముస్లింలు జరుపుకునే పండగల్లో రంజాన్ పెద్ద పండగ. ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్ ని అనుసరిస్తారు. ఈ క్యాలెండర్ లో వచ్చే తొమ్మిదో నెల రంజాన్. ఈ మాసాన్ని ముస్లిములు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన 'రోజా' ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది.