కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం ఇదే అదనుగా కరోనా రోగులు దోచుకుంటున్నాయి.  రోజుకో లక్ష రూపాయల చొప్పున వసూలు చేస్తూ రోగుల మరణ భయాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. ఇందుకు ఉదాహరణగా హైదరాబాద్ నాగోల్ లోని ఓ ఆస్పత్రి దోపిడీ ఉదంతం వెలుగు చూసింది.