జగన్ అధికారంలోకి రాగానే, గత చంద్రబాబు ప్రభుత్వంలో అమలు చేసిన ప్రతి పథకాన్ని ఆపేసిన విషయం తెలిసిందే. గతంలో బాబు ముద్ర ఉన్న ప్రతిదానికి జగన్ చెక్ పెట్టేశారు. ఇక గతంలో కంటే మిన్నగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందుతున్నారు. అలాగే ప్రతి పథకంలోనూ జగన్ మార్క్ ఉంటుంది. అయితే గతంలో ప్రవేశ పెట్టిన ఏ పథకం ఆపినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు గానీ, చంద్రబాబు హయాంలో ప్రతి పేదవాడి ఆకలి తీరాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్లని ఆపడంపై ప్రజలు అసంతృప్తిగానే ఉన్నారు.