గతంలో టీడీపీ అధికారంలో ఉండగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్కు షాక్ ఇచ్చి, చంద్రబాబు జై కొట్టిన విషయం తెలిసిందే. చంద్రబాబు అప్పుడు 23 మందిని లాక్కోవడం వల్లే, 2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లు గెలుచుకుందని, ఇది దేవుడి స్క్రిప్ట్ అని జగన్తో సహ పలువురు వైసీపీ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే అది దేవుడి స్క్రిప్ట్ అవునో, కాదో తెలియదు గానీ, అప్పుడు వైసీపీని వీడి టీడీపీలో చేరినవారు ఇప్పుడు మాత్రం బాగానే బాధపడుతున్నారు.