కృష్ణా జిల్లా విజయవాడ రాజకీయాల్లో కమ్మ నేతల డామినేషన్ ఉంటుందనే సంగతి తెలిసిందే. అందులోనూ టీడీపీలోని కమ్మ నాయకుల హవా ఎక్కువగా ఉంటుంది. విజయవాడలో గానీ, చుట్టుపక్కన ఉన్న నియోజకవర్గాల్లో ఈ కమ్మ నాయకులదే పెత్తనం. విజయవాడ ఎంపీగా కేశినేని నాని ఉంటే, తూర్పు ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ఉన్నారు. అటు మైలవరం ఇన్చార్జ్గా దేవినేని ఉమా, పెనమలూరుకు బోడే ప్రసాద్ ఉన్నారు. ఇటు టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నారు.