కరోనా ధాటికి తాళలేక దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పెట్టాయి. లాక్ డౌన్ పెట్టినప్పటికీ, జనసంద్రం తగ్గడం లేదు. దాదాపు చాలా వరకు మాస్కులు ధరిస్తున్నా, సామాజిక దూరం పాటించడం లేదన్నది వాస్తవం. దీనితో కేసులు సంఖ్య తగ్గడం లేదు. ఇదంతా ఇలా ఉంటే లాక్ డౌన్ వలన ముఖ్యంగా పిల్లలు ఇంట్లోనే ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.