వైసీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ కామెంట్ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఎల్లో మీడియాకు ఎందుకు ఇంత కడుపు మంటా ? అని నాయకులు ప్రశ్నిస్తున్నారు. విషయంలోకి వెళ్తే.. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు కావడాన్ని జీర్ణించుకోలేని వ్యక్తుల్లో, మీడియా అధిపతుల్లో.. ఎల్లో మీడియా అధినేత ఒకరు. దమ్మున్న అధినేతగా గుర్తింపు కోసం తహతహలాడే ఆయన.. ఏపీలో జగన్ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు పడిపోతే బాగుండు! అని అనుకునేవారిలో ముందున్నారని.. వైసీపీ నాయకులు గుసగుసలాడుతుంటారు.