వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం రాజు, అదే పార్టీపై నిత్యం విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో ఉంటూ ప్రతిరోజూ రచ్చబండ పేరిట మీడియా సమావేశం పెట్టి, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చారు. అలాగే ప్రతిపక్ష టీడీపీకి సపోర్ట్‌గా మాట్లాడారు. ఇక తాజాగా రాజుగారి విమర్శలు హద్దులు దాటాయి. సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్‌గా తీవ్ర విమర్శలు గుప్పించారు. అసలు సీఎం జగన్‌కు పిచ్చి ఉందని, ఆయనకు ట్రీట్మెంట్ ఇస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అలాగే సజ్జలని బిజ్జల అంటూ మాట్లాడారు.