రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో అధికార పక్షం తీవ్రంగా స్పందించింది. ఆయనపై ఎవరూ కక్షసాధింపులకు పాల్పడలేదని, ప్రభుత్వంపై ఆయన చేసిన తీవ్ర విమర్శల కారణంగానే కేసులు నమోదయ్యాయని తెలిపారు నేతలు. దీనికి సంబంధించిన వీడియో సాక్ష్యాలే రఘురామ కృష్ణంరాజు రాజద్రోహం చేశారా లేదా అనే విషయాన్ని బట్టబయలు చేస్తాయని చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. రఘురామకృష్ణంరాజు కేసులో సీఐడీ ఏకంగా 46 వీడియోలను కోర్టు ముందు సమర్పించిందని చెప్పారు అంబటి.