డీఆర్డీవో అభివృద్ధి చేసిన 2-డియాక్సీ డి-గ్లూకోజ్(2డీజీ) ఔషధం ఈరోజు లాంఛనంగా విడుదల కాబోతోంది. తొలి విడతలో 10వేల ప్యాకెట్లు అందుబాటులోకి తెస్తారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఢిల్లీలో వీటిని విడుదల చేస్తారు. రెండో విడతలో భాగంగా మరిన్ని ప్యాకెట్లను ఈ నెల 27, 28 తేదీల్లో విడుదల చేయబోతున్నారు. జూన్ నెలలో డాక్టర్ రెడ్డీస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఔషధం పూర్తి స్థాయిలో మార్కెట్లోకి వస్తుంది.