ప్రపంచంలో వాక్సినేషన్ లో 30 కోట్లతో చైనా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత 26 కోట్లతో అమెరికా రెండో స్థానంలో ఉంది. 18 కోట్లతో 3వ స్థానంలో భారత్ ఉంది. పేరుకు ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నా..ఇది మన జనాభాతో పోలిస్తే చాలా తక్కువే. అందుకే ఇప్పుడు వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెంచుతున్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న చర్యలతో.. అక్టోబర్ నాటికి భారత్ మొదటి స్థానానికి వెళ్తుందని కేంద్రం చెబుతోంది.