కరోనా సమయంలోమంత్రి కేటీఆర్ ట్విట్టర్ ఎకౌంట్ కు ట్రాఫిక్ ఫుల్లుగా పెరిగింది. రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి కుటుంబీకులు, సన్నిహితుల నుంచి మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తులు జోరుగా వస్తున్నాయి. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లు కావాలంటూ సాయం కోసం చాలా మంది కేటీఆర్ ట్విట్టర్ ఎకౌంట్‌ను ఆశ్రయిస్తున్నారు.