ఏపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ విషయం బాగా హైలైట్ అయిపోయింది. ఈయన అరెస్ట్ విషయంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతుంది. అసలు వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ, అదే పార్టీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష టీడీపీ నేతల మాదిరిగానే రాజుగారు ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టి, జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.