జగన్ దెబ్బకు ఏపీలో టీడీపీ పరిస్తితి చాలా ఘోరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ జిల్లా, ఈ జిల్లా అనే తేడా లేకుండా ప్రతిచోటా టీడీపీ వీక్‌గా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో సైతం టీడీపీకి సరైన నాయకత్వం లేదు. అసలు 2019 ఎన్నికల తర్వాత చాలామంది టీడీపీ నాయకులు సైడ్ అయిపోయారు. పలువురు నేతలు వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇంకొందరు వైసీపీ ప్రభుత్వం పెట్టే కేసులు దెబ్బకు అడ్రెస్ ఉండటం లేదు.