25కి 25 ఎంపీలని ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తీసుకొస్తామని 2019 ఎన్నికల ముందు జగన్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్ మాటని విశ్వసించిన ప్రజలు వైసీపీకి 22 మంది ఎంపీలు ఇచ్చారు. స్వల్ప మెజారిటీలతో ముగ్గురు ఎంపీలు టీడీపీ తరుపున గెలిచారు. ఇక వైసీపీకి 22 మంది ఎంపీలు ఇవ్వడం వల్ల రాష్ట్రానికి వచ్చిన లాభం ఏంటి? అంటే చెప్పడం కష్టమే. ఈ రెండేళ్లలో వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి సాధించింది శూన్యమే అని చెప్పాలి.