రాష్ట్రంలో ఎల్లో మీడియా పరిస్థితి దారుణంగా ఉందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగానే ఉన్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు జగన్ను అధికారంలో నుంచి దింపేసి.. చంద్రబాబును ఎక్కించేసేందుకు ఈ మీడియా బీభత్సంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కరోనా సయమంలో ఏపీ సీఎం జగన్.. ఒకవైపు ప్రజలకు వైద్యం చేరువ చేస్తూనే.. మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను నిలుపుదల చేయకుండా ముందుకు తీసుకువెళ్తున్నారు. దీంతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కేవలం.. కరోనాపైనే దృష్టి పెట్టాయి.