2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌ని తట్టుకుని టీడీపీ నుంచి ముగ్గురు ఎంపీలు విజయం సాధించిన విషయం తెలిసిందే. విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్, శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. అయితే వీరిలో కేశినేని, గల్లా పరిస్తితి ఎలా ఉన్న రామ్మోహన్ మాత్రం శ్రీకాకుళంలో ఇంకా బలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతున్న పార్లమెంట్ స్థానంలో ఆ పార్టీ కొంచెం బలహీనంగానే ఉన్నట్లు కనిపిస్తోంది.