కరోనా ట్రీట్మెంట్ ప్రొటోకాల్ లో ప్లాస్మా థెరపీని పెట్టలేదని.. ప్లాస్మా థెరపీని ప్రోత్సహించవద్దని జిల్లా అధికారులకు సూచిస్తున్నామని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప్లాస్మా థెరపీని కరోనా చికిత్సలో భాగం చేయొద్దని ఆయన చెప్పారు. పరోక్షంగా దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టం చేశారు.