బ్లాక్ ఫంగస్ రోగులకు తెలంగాణ సర్కారు ఓ గుడ్ న్యూస్ చెబుతోంది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు అల్లోపతితో పాటు ఆయుర్వేద, హోమియోపతి, యునాని వైద్య విధానాలను పెద్ద ఎత్తున వినియోగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనాతో బ్లాక్‌ఫంగస్ సోకిన వారికి గాంధీ ఆసుపత్రిలో, కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ వ్యాధి సోకిన వారికి కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో చికిత్స సదుపాయాలు కల్పించారు.