ఏపీలో టీడీపీకి కాస్త బలంగా ఉండే జిల్లాల్లో కృష్ణా జిల్లా కూడా ఒకటి. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి. అలాగే టీడీపీ అధికారంలోకి రావడానికి కృష్ణా జిల్లా బాగా ఉపయోగపడేది. అయితే 2014 వరకు జిల్లాలో టీడీపీ బాగానే బలంగా కనిపించింది. కానీ 2019 ఎన్నికల తర్వాత జిల్లాలో వైసీపీ బలంగా తయారైంది.