రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలది చాలా ముఖ్యమైన పాత్ర. ప్రభుత్వం చేసే తప్పులని ఎత్తి చూపుతూ, ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి అండగా ఉంటూ ప్రభుత్వానికి ధీటుగా ఉండాల్సింది ప్రతిపక్షమే. అయితే ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీని, అధికారంలో ఉన్న పార్టీ తోక్కేసే ప్రయత్నాలు చేస్తుంది. 2014 నుంచి ఏపీలో ఇదే పరిస్తితి కొనసాగుతుంది. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్ష వైసీపీని లేకుండా చేయాలని చూసింది.