2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ వేవ్ ఉన్నా సరే విశాఖ నగరంలో టీడీపీ సత్తా చాటిన విషయం తెలిసిందే. నగరంలోని నాలుగు సీట్లని టీడీపీనే గెలిచింది. నాలుగు దిక్కులుగా ఉన్న తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్ధులు గెలిచారు. అయితే జగన్ అధికారంలోకి రావడంతో విశాఖ నగరంలో కూడా వైసీపీ ఆధిక్యం పెంచుకోవడమే లక్ష్యంగా పావులు కదిపారు. ముఖ్యంగా విశాఖ రాజకీయాలని చూసుకుంటున్న విజయసాయిరెడ్డి, ఎక్కడికక్కడ టీడీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేశారు.