గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష వైసీపీ నేతలని, కార్యకర్తలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. అసలు చంద్రబాబు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే చాలు, వారికి చుక్కలు కనిపించేవి. తమకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై బాబు ప్రభుత్వం చర్యలు తీసుకునేది. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా సరే వారిపై కేసులు పెట్టేవారు. అలా చాలామంది వైసీపీ కార్యకర్తలని అరెస్ట్ చేశారు. అలాగే జనసేన కార్యకర్తలని సైతం అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.