కృష్ణా జిల్లా అంటే టీడీపీకి పట్టు ఉన్న జిల్లా. 2019 ఎన్నికల ముందు వరకు జిల్లాలో టీడీపీకి తిరుగులేదు. కానీ ఆ ఎన్నికల తర్వాతే పరిస్తితి మారిపోయింది. ఊహించని విధంగా జిల్లాలో వైసీపీ ఆధిక్యం పెరిగింది. జిల్లాలో వైసీపీకి 15(టీడీపీని వీడిన వల్లభనేని వంశీతో కలుపుకుంటే) మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక వైసీపీకి ఒక ఎంపీ ఉన్నారు. అటు టీడీపీకి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉన్నారు.