ప్రకృతి అందాలకు ప్రసిద్ధమైన అరకులో రాజకీయాలు ఎప్పుడు ఒక పార్టీకే అనుకూలంగా ఉంటాయి. గతంలో టీడీపీకి ఉండే అరకులో వైఎస్సార్ ఎంట్రీతో పరిస్తితి మారిపోయింది. అరకు పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ సత్తా చాటేది. ఇక కాంగ్రెస్ తర్వాత వైసీపీ హవా నడుస్తోంది. 2014 ఎన్నికల్లో రాష్టంలో టీడీపీ హవా కొనసాగిన అరకు పార్లమెంట్లో మాత్రం వైసీపీ డామినేషన్ కనిపించింది.