కరోనా లాంటి ప్రాణాంతకమైన వ్యాధి వచ్చినప్పుడు నివారణ కోసం ఎవ్వరు ఏ మందు ఇచ్చినా తీసుకునే పరిస్థితుల్లో ఇప్పుడు మన భారతదేశ ప్రజలున్నారు. కొంతమంది అయితే ఇలాగే ఎవ్వరో చెప్పారని, అలాగే అనుకరించి ప్రాణాలను సైతం పోగొట్టుకున్న సంఘటనలు మనము ఇటీవల చూశాము. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో చోటు చేసుకుంది.