భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చే సమయానికి మొత్తం 43 రైల్వే సంస్థలు నెలకొల్పబడ్డాయి. 1951 లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్భవించబడింది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి కావడం విశేషం.