రైతు అంటే దేశానికి వెన్నెముక లాంటి వాడు. రైతు కష్టపడి పంటను పండిస్తేనే దేశానికి తినడానికి తిండి దొరుకుతుంది. అటువంటి రైతన్నను మనము ఎంతగానో గౌరవించాలి. కానీ నేటి సమాజంలో రైతుల మీద చులకన భావం ఎక్కువైపోయింది. ప్రస్తుతం ఉన్న రైతులు ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.