ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఊహించని విధంగా సెకండ్ వేవ్‌లో ఎక్కువమంది ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ప్రతిరోజూ 20 వేలకి పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. అలాగే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ప్రభుత్వం కూడా కరోనాని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకుంటుంది.