ఏ పార్టీ అధికారంలో ఉన్న ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం సహజమే. ఎవరికి ఎలాంటి పథకం ఇస్తే ఓట్లు పడతాయనే కోణంలోనే ప్రభుత్వాలు ముందుకెళ్తాయి. కులాలు, మతాలు, వర్గాలు వారిగా పథకాలు అమలు అవుతాయి. అయితే ఇలాంటి ఓటు బ్యాంక్ పథకాలకు జగన్ ప్రభుత్వం ఏమి అతీతంగా లేదు. ఊహించని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్....తాను ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ వచ్చారు.