ఏపీలో బీజేపీ నేతల రాజకీయాలు ఎప్పుడు ఒక లైన్లో ఉండవనే సంగతి తెలిసిందే. బీజేపీ నేతలు కొందరు అధికార వైసీపీకి అనుకూలంగా ఉంటూ, ప్రతిపక్ష టీడీపీని టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంటారు. అలాగే మరికొందరు బీజేపీ నేతలు టీడీపీని ఒక్కమాట అనకుండా వైసీపీపై విరుచుకుపడుతుంటారు. ఇలా ఏపీ బీజేపీలో రెండు రకాలుగా రాజకీయాలు ఉంటాయి. అయితే ఇలా బీజేపీలో ఉంటూ కాస్త చంద్రబాబుకు అనుకూలంగా నడిచే బీజేపీ నాయకుల్లో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఒకరని చెప్పొచ్చు.