కోవిడ్ రెండో దశతో ఇప్పటికే దేశం తీవ్రంగా సతమతమౌతుంటే మరో వైపు అరేబియాలో అల్పపీడనం కారణంగా ఏర్పడిన తౌక్తే తుఫాను ప్రమాదంగా మారుతోంది. ఇప్పటికే ఈ తుఫాను ప్రభావం పది రాష్ట్రాలపై పడిన విషయం తెలిసిందే. దీని కారణంగా సముద్ర తీరప్రాంతాలు అయిన గోవా, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలపై రెండు మూడు రోజుల పాటు అధిక ప్రభావం పడింది.