నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అయిన నాయకుడు. వైసీపీ తరుపున ఎంపీగా గెలిచి, అదే పార్టీపై విమర్శలు చేస్తున్న రఘురామని ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచాక కొన్నిరోజులు వైసీపీ ఎంపీగా జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా నడిచిన రాజుగారు తర్వాత తర్వాత మారిపోతూ వచ్చారు. మొదట సీఎం జగన్ని విమర్శించకుండా, సొంత పార్టీ నేతల అవినీతిపై విమర్శలు చేశారు. పలువురు నాయకులు ఇసుక, ఇళ్ల పట్టాల్లో తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు.