ఏపీ రాజకీయాల్లో జేసీ ఫ్యామిలీకి పెద్ద చరిత్రే ఉంది. దశాబ్దాల పాటు జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్లో కీలకంగా పనిచేశారు. రాష్ట్రంలో టీడీపీ వేవ్ ఉన్న సమయంలో కూడా తాడిపత్రిలో జేసీ గెలిచి సత్తా చాటారు. 1985 నుంచి 2009 వరకు జేసీ ఆరుసార్లు కాంగ్రెస్ నుంచి గెలిచారు. నెక్స్ట్ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి ఘోరంగా తయారవ్వడంతో జేసీ ఫ్యామిలీ టీడీపీలోకి జంప్ కొట్టేసింది. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో జేసీ దివాకర్ అనంతపురం ఎంపీగా పోటీ చేయగా, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.