ఏపీ రాజకీయాల్లో భూమా ఫ్యామిలీకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో వీరికి తిరుగులేదు. దశాబ్దాల పాటు భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలు ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజలకు సేవ చేశారు. మొదట టీడీపీలో కీలకంగా ఎదిగిన వీరు, తర్వాత ప్రజారాజ్యంలో కూడా గెలిచారు. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు. అయితే 2014 ఎన్నికల సమయంలో శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో ఆమె స్థానంలో భూమా అఖిలప్రియ వచ్చారు.