రాజకీయాల్లో ఒకసారి కాకపోయిన మరొకసారైనా అదృష్టం కలిసొస్తుంది. కానీ ఏ మాత్రం అదృష్టం కలిసిరాకుండా వరుసగా ఓటములతో సతమవుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సోమిరెడ్డి, 1994, 1999 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి గెలిచారు. అలాగే చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు.