దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు పలు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ తరుణంలో ప్రజలు జీవనోపాధిని కోల్పోయి ఆర్థికంగాను తీవ్ర సమస్యలను ఎదుర్కుంటున్నారు.