కరోనా పేరు చెప్పి విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని బాంబే హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇలా ప్రమోట్ చేస్తూ పోతే ఈ దేశంలో విద్యావ్యవస్థను ఎవరూ కాపాడలేరని కామెంట్ చేసింది. పదో తరగతి ఒక్కటే స్కూల్ ఫైనల్ పరీక్ష అని అది కూడా నిర్వహించకపోతే విద్యావ్యవస్థ ఎలా బాగు పడుతుందని ప్రశ్నించింది.