ఏపీ సీఎం జగన్ దూకుడుకు ఏపీ హైకోర్టు బ్రేక్ వేసింది. ఏపీలో ఇటీవల జరిగిన ఎంపీటిసి, జెడ్పీటిసి ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తాజా తీర్పు జగన్ సర్కారుకు పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పాలి. అయితే దీనిపై జగన్ సర్కారు న్యాయపోరాటం చేసే అవకాశం ఉంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.