ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ లను నిర్ణయించారు. పదో తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకొన్న  5,21,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులను చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వీరిలో 5,16,578 మంది రెగ్యులర్ విద్యార్థులు.. 4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారని అన్నారు.