ఏపీ ప్రభుత్వం తాజాగా బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2.28 లక్షల కోట్లతో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. కరోనా సమయం కావడంతో సమావేశాన్ని ఒక్కరోజులోనే ముగించేశారు. ఇలా సమావేశాన్ని ఒక్కరోజే పెట్టడంతో ప్రతిపక్ష టీడీపీ బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరించింది. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి జూమ్ యాప్లో మాక్ అసెంబ్లీ నిర్వహించారు.