2019 ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ పరిస్తితి ఘోరంగా తయారైన విషయం తెలిసిందే. ఆ పార్టీ దారుణంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. దీంతో చాలామంది నాయకులు టీడీపీని వదిలేసి బీజేపీ, వైసీపీల్లోకి జంప్ కొట్టేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు సైతం టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళిపోయారు. తన తనయుడు సుధీర్‌తో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు.