ఏపీలో మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గర పడుతుంది. మరో ఆరు నెలల్లో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. జగన్ అధికారంలోకి రాగానే ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలన మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అలాగే మొదటివిడతలో ఛాన్స్ దక్కనివారికి, రెండోవిడతలో అవకాశం కల్పిస్తానని చెప్పారు. అలాగే పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇస్తానని అన్నారు.