అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతున్న సరే జగన్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గట్లేదనే విషయం తెలిసిందే. రోజురోజుకూ జగన్ ఇమేజ్ పెరగడంతో, వైసీపీ మరింత స్ట్రాంగ్ అవుతుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మంచి విజయాలు సాధించింది. అటు టీడీపీ పరిస్తితి మాత్రం ఘోరంగా తయారవుతుంది. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు మంచి పనితీరు కనబర్చడం లేదు. కాకపోతే కొందరు నాయకులు మాత్రం తమకు సాధ్యమైన మేర కష్టపడుతున్నారు.