గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం టీడీపీకి కాస్త అనుకూలమైన నియోజకవర్గం. టీడీపీ ఎక్కువసార్లు ఈ నియోజకవర్గంలో గెలిచింది. అలాగే ఇక్కడ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బలమైన నాయకుడు. గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కీలకపాత్ర పోషించారు. అలాగే పేటలో ఈయనకు మంచి బలం ఉంది. దీంతో 2019 ఎన్నికల్లో ఈయన గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా యువనాయకురాలు విడదల రజిని వైసీపీ తరుపున విజయం సాధించేసి సంచలనం సృష్టించారు.