వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. జిల్లాలోని సెంట్రల్ జైలును సందర్శించారు. జైలు బ్యారకుల్లో కలియతిరిగారు. జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలతో కొద్దిసేపు మాట్లాడారు. వారు జైలుకు ఏ శిక్ష మేరకు వచ్చారు? వారి ఊరు ఎక్కడ? వారి కుటుంబ పరిస్థితి ఏంటిది? అని అడిగి తెలుసుకున్నారు.