మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ప్రస్తుతం స్కూల్ ఫైనల్ చదువుతున్నాడు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించే ఈ కుర్రాడు ఇప్పుడు ఏకంగా క్లైమాట్ చేంజ్ అంశంపై ఓ వీడియో రూపొందించాడు. భూమిని కాపాడితే.. అది మనల్ని కాపాడుతుందని.. నాశనం చేయాలని చూస్తే.. అదీ మనల్ని నాశనం చేస్తుందని చెబుతున్నారు. అంతే కాదు.. క్లైమాట్ చేంజ్ కోసం కొన్ని విధివిధానాలను రూపొందించుకోవాలని కేటీఆర్ తనయుడు సూచిస్తున్నారు.