2019 ఎన్నికల్లో జగన్ గాలిని తట్టుకుని టీడీపీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇందులో నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు వైసీపీ వైపుకు వెళ్లిపోయారు. దీంతో టీడీపీ బలం 19కు తగ్గింది. అదే సమయంలో వైసీపీ అధికారంలో ఉండటంతో పలు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేల బలం కూడా తగ్గిపోయింది. ముఖ్యంగా గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వీక్ అయినట్లే కనిపిస్తోంది.